నిరుపేద పద్మశాలి విద్యార్థినికి ఐదేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించనున్న TPUS
ఎంబీబీఎస్ విద్యకు భరోసా.. పేద విద్యార్థిని చదువుకు అండగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వరంగల్: నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన పద్మశాలి విద్యార్థిని కొంతం వైష్ణవి ఎంబీబీఎస్ విద్యకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) వరంగల్ జిల్లా తరఫున చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థిని వైద్య విద్యను అభ్యసించేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజును ఐదేళ్ల పాటు చెల్లిస్తామని సంఘం హామీ ఇచ్చింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలిచే లక్ష్యంతో సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది. వరంగల్లో సోమవారం నిర్వహించిన POPA పద్మశాలి ప్రతిభా పురస్కార ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి...