వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
ఆరు రోజులుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో వరంగల్లోని సీకేఎం ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఆరు రోజులుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు, అవసరమైన వారికి భోజనం అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కుసుమ సత్యనారాయణ, మండల పరశురాములు, మామిడాల రమేష్ బాబుతో పాటు రెడ్ క్రాస్ సభ్యులు...