అంబేద్కర్ భవన్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం

అగ్రవర్ణాల వద్ద అడుక్కు తింటుంటే అధికారం రాదని ,కడుపు నిండదని అధికారం అనేది దక్కాలంటే ఐక్య పోరాటమే ఏకైక మార్గమని మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడి అత్యాచారాలకు అవమానాల ఎదుర్కొని, అధికారానికి దూరంగా ఉండి కుల పీడనకు గురి అవుతున్నారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా ఒరిగిందేమీ లేదని, పార్టీలను పక్కనపెట్టి ప్రతి ఒక్క మాదిగ అందరూ ఏకమై మాదిగ శక్తి ఏంటో పాలకవర్గాలకు చూపించాలని ఆయన అన్నారు. త్వరలో వేలాది...