మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి రూ.20 కోట్లు మంజూరు చేయించిన మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఛాయా సోమేశ్వర ఆలయ కమిటీ నల్లగొండ: నల్లగొండ పట్టణ సమీపంలోని చారిత్రాత్మక పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కోడదల ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయం ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుమీద ఆలయంలో ప్రత్యేక పూజలు...