నరేశ్ గుప్తాకు ఇండియా లీడర్‌షిప్ అవార్డు హనుమకొండ గణిత నిపుణుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు – పలువురి అభినందనలు

హనుమకొండ: హనుమకొండకు చెందిన ప్రముఖ గణిత నిపుణుడు పల్లెర్ల నరేశ్ గుప్తా ఇండియా లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా స్కూల్ లీడర్‌షిప్ సమ్మిట్–2026లో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. WASP వ్యవస్థాపకురాలు డాక్టర్ దీపశిఖా చేతుల మీదుగా నరేశ్ గుప్తా అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యారంగానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలాంటి జాతీయ స్థాయి వేదికపై నరేశ్ గుప్తాకు అవార్డు లభించడం హనుమకొండ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. గణిత రంగంలో తన నైపుణ్యంతో గుర్తింపు పొందిన నరేశ్ గుప్తాకు ఈ అవార్డు లభించడంపై పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు హర్షం...