ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది

చింతల్ బ్రిడ్జి సమీపంలో సమయస్ఫూర్తితో స్పందించి వ్యక్తికి రక్షణ వరంగల్, అక్టోబర్ 27: వరంగల్‌లోని చింతల్ బ్రిడ్జి సమీపంలో ఆత్మహత్యకు ప్రయత్నించే ఉద్దేశంతో ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా కాపాడారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎస్‌ఆర్‌ఆర్ తోట, కరీమాబాద్, వరంగల్‌కు చెందిన రౌత్య సాయి కుమార్ (30), తండ్రి చంద్రయ్య, ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించిన హెచ్‌సీ-512 ఎన్. రవీందర్, ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐలు దుర్గాప్రసాద్, పితాంబరం, హెచ్‌సీ సారంగపాణి సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని సురక్షితంగా కాపాడారు. అనంతరం ఈ విషయాన్ని ఆర్‌పీఎఫ్ సీఐ వి. నరేష్ కుమార్‌కు తెలియజేశారు....