కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

*పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి – జిల్లా ఎస్పీ.* .. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు మంగళవారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది కిట్ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు,...