13వ డివిజన్‌ విద్యుత్ నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోమటిరెడ్డి, కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం

*నల్లగొండ పట్టణంలోని 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు* *రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో కాలనీలో సీసీ రోడ్లు వేయించడంతో స్థానికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు* *ఈ సందర్భంగా విద్యుత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంచర్లకుంట్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు* *కాలనీలో రోడ్ల నిర్మాణానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి...