*గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ పాఠశాల బంగారు బాట*
జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో నెల్లికుదురు,ఆక్టోబర్ 27 *నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన....* *విద్య ద్వారానే సమాజంలో సమానత్వం – విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి....* మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు విద్యారంగ అభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పబ్లిక్ స్కూల్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురులో రూ.7 కోట్ల 50 లక్షల నిధులతో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 122 పబ్లిక్ స్కూళ్లకు అనుమతులు లభించగా, మహబూబాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నెల్లికుదురులో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య...