నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా వరుణ యాగం
తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం మహా వరుణయాగాన్ని నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్.. దీనికి వేదిక అయింది. జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ వరుణయాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ తెల్లవారు జామున 4 గంటలకు నాగార్జున సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఈ క్రతువు ఆరంభమైంది. అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది.రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే ఈ యాగం ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం యాగశాల ప్రాంగణంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 హోమగుండాలను ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 108 మంది...