తిరుపతి లో ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్ని కంపార్టుమెంట్ల లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా, టీటీడీ శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. ఒకే రోజు రెండు సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఈ వెసులుబాటు దక్కనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఈ అవకాశం ఎలా దక్కించుకోవాలో అధికారులు స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని ఒక్క సారి దర్శించుకుంటే చాలు. ఆ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలి...