ప్రేమించిన యువతిని దారుణంగా హతమార్చిన ప్రియుడు

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో విషాదకర ఘటన పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తనను ప్రేమించిన యువతి ఉద్యోగంలో చేరిన తర్వాత పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఓ యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద హసీనా అనే యువతిని బాలసైదులు అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసీనా, బాలసైదులు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే హసీనా ఉద్యోగంలో చేరిన తర్వాత తనను పట్టించుకోవడం లేదనే అనుమానం బాలసైదులులో పెరిగినట్లు తెలుస్తోంది....