అవయవ దానం అత్యున్నతమైన దానం-తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్
అన్ని దానాల్లోకెల్లా అవయవదానం అత్యున్నమైనదని, మానవ జన్మకు మహాదవకాశమని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి ఆధ్వర్యంలో గడియారం సెంటర్లోని పూలే విగ్రహం వద్దజరిగిన అవయవ దాన అవగాహన సదస్సులో డాక్టర్ అశోక్ పాల్గొని మాట్లాడుతూ నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు, అవయవ దానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షు ను, దేహ దానం ద్వారా భవిష్యత్తు వైద్యుల పరిశోధనలకు అంకితం కావచ్చునని తెలిపారు. మరణించిన తర్వాత కాల్చడం ద్వారా బూడిదగా, మట్టిలో పాతి పెట్టడం ద్వారా మట్టిగా మారిపోయే...