బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం: పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్..
భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1947 ఆగస్టు 11న బ్రిటీష్ పాలన నుంచి బలూచిస్తాన్ తన స్వాతంత్యాన్ని ప్రకటించుకుంది. నాటి సరిహద్దుల ప్రకారం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఉనికిలో లేని సమయంలోనే బలూచిస్తాన్ ఓ స్వతంత్ర ప్రాంతంగా ఉండేది. అయితే 1947 చివరలో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను తన దేశంలో విలీనం చేసుకుంది. నాటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు తమ స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. పాక్ అణచివేత.. చైనా జోక్యం దశాబ్ధాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం బలూచిస్తాన్ ప్రాంతంపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. బలూచిస్తాన్ అపారమైన సహజ సంపదను కలిగి ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ దానిని ఓ రెండో తరగతి...