పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది. నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900,...