ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్
బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ అమాయక ప్రజలకు వల.. తెలంగాణలో 22 సైబర్ కేసులతో లింకులు న్యూఢిల్లీ: అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ మోసపూరిత కాల్ సెంటర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతంలో మూడు నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కాల్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. బజాజ్ ఫైనాన్స్...