అక్టోబర్ 9న హైదరాబాద్‌లో లక్ష మందితో బహుజన సమర సభ

నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ పిలుపు నల్గొండ: నల్గొండ జిల్లా బీఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, బహుజనుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మాన్యవర్ కాన్షీరామ్ గారి వర్ధంతి సందర్భంగా భారీ బహుజన సమర సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని ఇబ్రహీం శేఖర్ కోరారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా బహుజనులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని...