తెలంగాణలో సీఎం మార్పుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలో సీఎం మార్పు అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరగాల్సిన అవసరం ఉందని ప్రజల్లో అభిప్రాయం ఉందని శ్రీహరి పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం మార్పుపై ఇప్పటివరకు సాగుతున్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని రాజనాల శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి...