నవభారత నిర్మాణంలో యువ శక్తి
పావన నవ జీవన బృందావన నిర్మాతలు, రేపటి యుగానికి దూతలు యువతరం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే అందులో ఉండే యువత శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన ప్రతిభాపాటవాల మీదనే ఆధారపడి ఉంటుంది. యువత అంటే కేవలం వయసులో ఉండే ఒక మైలురాయి కాదు అదొక చేతనా తరంగం, సమాజ దిశను మార్చే విప్లవ జ్వాల. కాలపు పుటల్లో నూతన అధ్యాయాలను లిఖించే అపరిమిత శక్తుల అక్షయపాత్ర ప్రతి యువ హృదయం. చీకట్లను చీల్చుకుంటూ వచ్చే ప్రభాత భానుడి వెలుగులా, నిశ్శబ్దాన్ని ఛేదించే క్రాంతి గర్జనలా యువతరం అడుగులు వేస్తోంది. రేపటి ఆశల సౌధానికి నేటి పునాది రాయి యువశక్తి. ప్రపంచం...