మత సామరస్యానికి ప్రతీక కాజీపేట దర్గా..వచ్చే ఉర్సు నాటికి మౌలిక వసతుల అభివృద్ధి పూర్తి చేస్తాం- మంత్రి పొంగులేటి
కులమత భేదాలకు అతీతంగా సర్వమతాల ప్రజలు ఐక్యంగా పాల్గొనే కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి, ఉర్సు ఉత్సవాల ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట దర్గాలో జరిగిన ఉర్సు వేడుకల్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ఉర్సులో పాల్గొనడం గొప్ప విషయమన్నారు.కాజీపేట దర్గాలో కనిపిస్తున్న...