ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి - వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత

రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. మంగళవారం హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC)వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (ICOP), ఫోటో ఎక్సిబిషన్ ను పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సీబీసీ రూపొందించిన జాతీయ పతాకం యొక్క ప్రస్థానం,...