నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 25 ఏళ్ల జైలు
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ జిల్లా POCSO న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాకు మొత్తం 25 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2020 మే 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు, అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, POCSO చట్టంలోని సెక్షన్ 3, 4 కింద 20 ఏళ్ల కారాగార శిక్ష...