అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్

వరంగల్, ఆగస్టు 13: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎన్యూమరేషన్ దశలో సేకరించబడని లేదా ‘Uncollectable’గా గుర్తించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పూర్తి వివరాలను అందించాలని కోరుతూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, BLA-1 మహమ్మద్ అయూబ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించలేదనే కారణంతో ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు కోల్పోకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం అందరి బాధ్యత అని...