ఖర్గేకు అవమానంపై నిరసన.. హనుమకొండలో రేపు భారీ యాత్ర, సత్యాగ్రహం
హనుమకొండ: హల్ద్వానీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన వివక్షపూరిత, అవమానకర చర్యను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) భారీ యాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ జంక్షన్ నుంచి యాత్ర ప్రారంభమై, పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహంతో ముగియనుంది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్టేట్ చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...