ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు” - ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

హిందూ ముస్లింల మధ్య నాకు వ్యత్యాసం లేదు. హిందూ - ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని పిలుపనిచ్చారు. ✅ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు ఈ సందర్భంగా...