కాకతీయ వస్త్ర పరిశ్రమలో విషాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఇద్దరు కార్మికుల మృతి

వరంగల్ జిల్లా: గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్క్‌లోని గణేశా ఏకోపెట్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సాంకేతిక నిపుణులు అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31) లిఫ్ట్‌లో చిక్కుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల...