గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరఫున స్పష్టమైన సమాధానం -కందుకూరి చంద్రసేన
గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం గురించి ప్రతి విషయాన్ని చులకనగా చూపిస్తూ, సభ్యుల మధ్య అపోహలు, అనుమానాలు మరియు విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు.- గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం, వర్కింగ్ ప్రెసిడెంట్, కందుకూరి చంద్రసేన సంఘం అంటే ఎవరో ఒక వ్యక్తి సొంతం కాదు. సంఘం అంటే సభ్యులందరిదీ. సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సమిష్టిగా చర్చించి తీసుకునే నిర్ణయాలే సంఘం నిర్ణయాలు. ఆ నిర్ణయాలను ప్రతి సభ్యుడు బాధ్యతగా గౌరవించి, అమలు చేయడంలో సహకరించినప్పుడే సంఘం మరింత బలపడుతుంది. సంఘం కొన్ని నిబంధనలు ఎందుకు పెట్టిందో, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా కేవలం విమర్శలు చేయడం...