ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలి -పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్
జన చరిత్ర/ఆత్మకూర్, వరంగల్ వెనుకబాటుకు గురైన పరకాల నియోజకవర్గం ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి యువత ఘన స్వాగతం పలకాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16న పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు యువత ముందుండి యువజన సంఘాలను మహిళా సంఘాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను తరలించాలని అన్నారు. ప్రభుత్వ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను...