వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.. రేపు భారీ యాత్ర, సత్యాగ్రహం
వరంగల్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన అవమానకర చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భారీ యాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావం తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ భారీ యాత్ర వెంకట్రామ జంక్షన్ నుంచి ప్రారంభమై, కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోనుంది. అక్కడ సత్యాగ్రహం నిర్వహించనున్నారు. రాజ్యాంగ...