బోనం ఎత్తుకున్న నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న, ఆర్టీఏ...