వరంగల్ పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కొండా కరుణాకర్

110 మంది అధికారులు ఓటు హక్కు వినియోగం వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో జరిగిన ఈ ఎన్నికల్లో వివిధ హోదాలకు చెందిన పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్...