సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై స్పాట్ ఫైన్లు.. వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలకు జియోట్యాగింగ్ చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ ఆదేశాలు హన్మకొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీల పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్.. జిల్లాలో వ్యర్థాల నిర్వహణ, సేకరణ, ప్రాసెసింగ్‌పై పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 42 గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వివరించగా, ఆయా...