వరి వేసుకోకండి .నష్టపోకండి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రైతులకు విజ్ఞప్తి

ఈ ఖరీఫ్ సీజన్ సమయం ముగిసినందున జిల్లాలోని రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని, వరి వేస్తే నష్టపోవాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. వ్యవసాయ అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి రైతులు వరి వేయకుండా అవగాహన కల్పించాలన్నారు. వరి పంట వేసేందుకు పెట్టే పెట్టుబడి, నీటి లభ్యత, వర్షాలు, భూగర్భ జలాలు, కూలీల పెట్టుబడి అన్నింటిని రైతులకు వివరించి చెప్పి వరి పంట జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రం శివారులో వరి సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు...