భరోసా కేంద్రాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్
మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం.. బాధితులకు సత్వర న్యాయం, అండగా నిలవాలి” – ఎస్పీ నల్గొండలోని భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. కేంద్రం ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులకు అందుతున్న పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు.బాధితులకు సత్వర సహాయం అందిస్తూ, గోప్యత, గౌరవం, సానుభూతితో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో చైల్డ్ ఫ్రెండ్లీ విధానంలో విచారణ, కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణించి వెంటనే స్పందించాలని, సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు సహకారం అందించాలని ఎస్పీ...