గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి- కేబినేట్ సబ్ కమిటి

26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాల పై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ దిశగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి డి....