ప్రజా ప్రభుత్వo అందించే పెన్షన్లు నిజమైన అర్హులకే దక్కాలి-పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదే పూర్తి బాధ్యత. గ్రామ పంచాయతీల్లోనే దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 31 నాటికి జాబితా రూపకల్పన పూర్తి కావాలి. జన చరిత్ర న్యూస్ పర్వతగిరి : తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గ్రామ...