ఎస్‌ఆర్ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
గోపాల్పూర్: ఎస్‌ఆర్ హైస్కూల్ గోపాల్పూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ మీసాల మల్లేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భావి భారత భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు, విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, దేశ ఔన్నత్యాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆశీర్వదించారు.కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జ్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల...