. గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వరంగల్: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రకాళి గుడికి వెళ్లే మార్గంలోని మూడు బాటల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మికులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐఎన్‌టీయూసీ 452 యూనియన్ అధ్యక్షులు వాగు మారి సత్యనారాయణ పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. అనంతరం 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బోడ డిన్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ప్రజలంతా ఐక్యత, సమగ్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య...