శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు బహుమతులు అందజేసిన 35వ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ వరంగల్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మేరుగు అశోక్ అభినందించి, వారికి ప్రతిభ పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం పట్ల పలువురు అభినందించారు. ఈ...