హనుమకొండ రెడ్ క్రాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సుబేదారి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్. రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం రెడ్ క్రాస్ ఆవరణలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు క్యాతం జగదీశ్వర్, కే. సతీష్ బాబు, ఫార్మసిస్ట్ కె. స్వప్న, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన యల్. ప్రవీణ్, యల్. మంజులలకు జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్. రవి, చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా...