విశ్రాంత ఉద్యోగులు సమాజసేవకు పునరంకితం కావాలి: డా. పి. విజయచందర్ రెడ్డి
హనుమకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ గేమ్స్ టోర్నమెంట్ విజేతలకు శనివారం అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ అనుభవాన్ని...