పర్వతగిరి జెడ్పి హెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జడ్పిహెచ్ఎస్ పర్వతగిరి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్క భారతీయుడు అందుకోవాలని అందుకు ప్రతి భారతీయ పౌరుడు విజ్ఞానవంతుడు అయినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాలను వృధా కాకుండా మన దేశ ప్రగతికి ప్రతి పౌరుడు తన హక్కులకై మాత్రమే పోరాడకుండా పౌర విధులకు బాధ్యత వహించాలని విద్యార్థులకు సూచించారు. స్టాఫ్ సెక్రటరీ శానం వెంకన్న గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తిని...