స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
*కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య* హనుమకొండలోని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. *ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ* ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో...