సేవా భావానికి ప్రతిరూపం అడేపు రమేష్ బాబు.. అకాల మరణం తీరని లోటు
వరంగల్: లేబర్ కాలనీ చేయూత స్వచ్ఛంద సంస్థ గౌరవ సభ్యులు అడేపు రమేష్ బాబు అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సమాజ సేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ, అందరితో ఆప్యాయంగా మెలిగిన ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, సేవా సంస్థల సభ్యులకు తీరని లోటుగా మారింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అవసరమైన వారికి తనవంతు సహాయ సహకారాలు అందించిన అడేపు రమేష్ బాబు సేవలను పలువురు స్మరించుకున్నారు. ఆయన మంచి మనసు, సేవా దృక్పథం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. రమేష్ బాబు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి...