నల్గొండలో రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోంది: కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్గొండ: నల్గొండలో ప్రస్తుతం రాక్షస రాజ్యం, కమిషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతోనే అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.సీపీఎం కార్యాలయంపై పోలీసులు దౌర్జన్యం చేయడం అమానుషమని భూపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీపీఎం నాయకులను అరెస్టు చేసిన ఎస్‌ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై తీవ్ర ఆరోపణలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో ఇంటికి రూ.3...