నల్లగొండ శ్రీ రామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు...

శ్రీ రామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు, యువత, చిన్నారులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుకల్లో వెల్ఫేర్ కమిటీ సభ్యులు శ్రీ ఓరుగంటి సోమన్న, కిరణ్, జానాచారి, అనిల్, నాగేందర్ చారి, ఉపేందర్, సైదాచారి, జానయ్య, జయరాజు, నాగరాజు తదితరులు తమ కుటుంబ...