ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ములుగు, ఆగస్టు 16: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అనంతరం గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల (HAM Roads) పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. గ్రామీణ రహదారుల సదుపాయాలు పటిష్టం కావడంతో ప్రజల రాకపోకలతో పాటు గ్రామీణ ఆర్థిక...