పరకాలలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

పరకాల, ఆగస్టు 16: పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శంకుస్థాపనలు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం. రూ.82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు. రూ.65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం. రూ.45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం. రూ.32.17 కోట్లతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం. రూ.10 కోట్లతో అక్కంపేటలో అభివృద్ధి ప్రణాళిక పనులు. రూ.5 కోట్లతో...