ధర్వేశిపురంలో ఘనంగా 301 బోనాల సమర్పణ

నల్లగొండ జిల్లా ధర్వేశిపురం: శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం (16-08-2026) ఘనంగా 301 బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,000 మంది కుమ్మరి కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివసత్తులు, పోతురాజులు, డోలు వాయిద్య బృందాల నడుమ భక్తిశ్రద్ధలతో మట్టికుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఇత్తడి, స్టీల్ బోనాల కంటే మట్టి కుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడం శ్రేష్ఠమని ఈ కార్యక్రమం ద్వారా కుమ్మర్లు చాటి చెప్పారు. శ్రావణ మాసంలో గ్రామదేవతలకు మట్టి కుండల్లో బోనాలు సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టి.కె. శ్రీనివాసు, కార్యదర్శి...