సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్

వరంగల్, ఆగస్టు 16, 2026: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *శ్రీ మహమ్మద్ అయూబ్* గారు పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ జిల్లా అభివృద్ధి, విద్యార్థులు, యువత, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత...